నోవా 2 సిరీస్ లో నోవా 2 నియో 5జీ, నోవా 2 ప్రో 5జీ మొదటి సేల్‌ను అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ కార్డులపై రూ.1000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. నోవా 2 నియో 5జీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. దీని 4GB+128GB ధర రూ.12,999 కాగా, 6GB+128GB ధర రూ.13,999గా ఉంది. అలాగే కాస్త ప్రీమియం ఫీచర్లు ఉన్న నోవా 2 ప్రో 5జీ 6GB+128GB వేరియంట్ ధర రూ.15,999, అలాగే 8GB+128GB వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. ప్రారంభ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ ఫోన్లను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో కొన్ని కామన్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే బాధ లేకుండా రెండింటిలోనూ 6000mAh బ్యాటరీని ఇచ్చారు. అలాగే ఇవి ఆండ్రాయిడ్ 16 ఆధారిత NxtQuantum OS సాఫ్ట్‌వేర్‌పై నడుస్తాయి. ఫొటోల కోసం రెండింటిలోనూ 48 MP సోనీ ప్రైమరీ కెమెరాను అందించడం విశేషం. నోవా 2 నియో 5G ఫోన్ 6.74 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది స్మూత్ పెర్ఫార్మెన్స్ కోసం 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా మెమొరీని 2TB వరకు పెంచుకోవచ్చు. ఇక సెల్ఫీల కోసం 8MP కెమెరా, సెక్యూరిటీ కోసం సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. నోవా 2 ప్రో 5G మరింత అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇది 6.9 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 144Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను అమర్చారు. దీని వెనుక భాగంలో 48MP కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా, ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని ద్వారా 2K వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో వచ్చే కస్టమైజబుల్ ఎల్‌ఈడీ నోటిఫికేషన్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది వేగంగా ఛార్జ్ అవ్వడానికి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ホーム
/
technology
/
నోవా 2 నియో 5జీ, నోవా 2 ప్రో 5జీ అమ్మకాలు ప్రారంభం : బ్యాంక్ కార్డులపై రూ.1000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
السبت، 27 يونيو 2026
000 on Bank Cards Instant Discount of Up to ₹1 phones are available for purchase on Flipkart as well as at select retail stores Sales of Nova 2 Neo 5G and Nova 2 Pro 5G Begin technology
ليست هناك تعليقات:
إرسال تعليق