ఏసర్ ప్రెడేటర్ హీలియోస్ 18 ఏఐ విడుదల

الاثنين، 1 يونيو 2026

Acer Predator Helios 18 AI Released first go on sale in the North American and EMEA markets in August including an Intel Core Ultra 9 processor and an Nvidia RTX 5090 graphics card technology

t f B! P L


సర్ ప్రెడేటర్ హీలియోస్ 18 ఏఐ  (2026) పేరుతో ల్యాప్‌టాప్ ను తీసుకొచ్చింది.  అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, కళ్లు చెదిరే స్పెసిఫికేషన్లతో లాంచ్ అయింది. ఈ ఏడాది చివర్లో ఇది అంతర్జాతీయంగా విక్రయానికి రానుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, ఎన్విడియా ఆర్‌టీఎక్స్ 5090 గ్రాఫిక్స్ కార్డ్ వంటి అత్యంత శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు.  ఈ సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇది ఈ ఏడాది ఆగస్టు నెలలో నార్త్ అమెరికా , ఇఎమ్ఇఎ మార్కెట్లలో మొదటిసారిగా అమ్మకానికి రానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఆ తర్వాత 2026 చివరి త్రైమాసికంలో ఆస్ట్రేలియా మార్కెట్లోకి ప్రవేశించనుంది.  ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 ప్రో , విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో గరిష్టంగా 18-అంగుళాల 4K (3,840×2,400 పిక్సెల్స్) మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz రిఫ్రెష్ రేట్, ఎన్విడియా అడ్వాన్స్‌డ్ ఆప్టిమస్, ఎన్విడియా జీ-సింక్, 100 శాతం డిసిఐ-పి3 కలర్ గ్యామట్, హెచ్‌డిఆర్ మోడ్ , కాల్మాన్ వెరిఫికేషన్ వంటి అత్యుత్తమ స్క్రీన్ ఫీచర్లతో వస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు థ్రిల్లింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ప్రిడేటర్ వోక్స్ టెక్నాలజీ , డిటిఎస్:ఎక్స్ అల్ట్రాతో కూడిన సిక్స్-స్పీకర్ సెటప్‌ను ఇందులో అమర్చారు. అంతేకాకుండా, ఇది ఆర్‌జిబి బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 290HX ప్లస్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీనికి తోడుగా 24GB GDDR7 విరామ్ కలిగిన ఎన్విడియా జెఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5090 జీపీయూని జత చేశారు. మల్టీటాస్కింగ్ కోసం ఇందులో ఏకంగా 256GB వరకు DDR5 ర్యామ్, గరిష్టంగా 6TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను సపోర్ట్ చేసే మూడు పిసిఐఇ జెన్ 5 ఎన్విఎమ్ఇ ఎస్ఎస్‌డి స్లాట్లను అందించారు. ల్యాప్‌టాప్ హీట్ అవ్వకుండా ఉండటం కోసం.. సిక్స్త్ జెనరేషన్ ప్రిడేటర్ ఏరోబ్లేడ్ 3D ఫ్యాన్స్, వెక్టర్ హీట్ పైప్ , లిక్విడ్ మెటల్ థర్మల్ గ్రీజ్ వంటి అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఈ ల్యాప్‌టాప్‌లో 99Wh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చారు. వీడియో కాల్స్ కోసం ఇందులో 1080p ఐఆర్ వెబ్‌క్యామ్ ఉంది. కనెక్టివిటీ పరంగా ఇది ఇంటెల్ కిల్లర్ వై-ఫై 7, బ్లూటూత్ 5.4 ని సపోర్ట్ చేస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ