10,000mAh బ్యాటరీ సామర్థ్యంతో హానర్ కొత్త మొబైల్ ?

Saturday, June 13, 2026

000mAh battery? Chinese tipster Digital Chat Station Is Honor Launching a New Mobile with a 10 shared this information on Weibo smart phone technology

t f B! P L

హానర్ 10,000mAh సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన బ్యాటరీతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబో వేదికగా హానర్ మొబైల్ గురించి సమాచారాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హానర్ రూపొందిస్తున్న కొత్త హ్యాండ్‌సెట్‌లో 10,000mAh కెపాసిటీని మించిన బ్యాటరీ ఉండనుంది.  అయితే ఈ ఫోన్ పేరు, ప్రాసెసర్, కెమెరా సిస్టమ్, చార్జింగ్ సామర్థ్యం, లాంచింగ్ డేట్ వంటి కీలక వివరాలేవీ ఇంకా బయటకు రాలేదు. ఈ లీకులపై హానర్ కంపెనీ కూడా అధికారికంగా స్పందించలేదు. ఇటీవల భారీ బ్యాటరీతో కూడిన పలు స్మార్ట్‌ఫోన్లను హానర్ కంపెనీ చైనాలో విడుదల చేసింది. 2025 డిసెంబర్‌లో విడుదలైన హానర్ విన్, హానర్ విన్ RT మోడళ్లలో 10,000mAh బ్యాటరీతో పాటు 6000నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే అందించింది. ఆ తర్వాతHonor Win Turbo వేరియంట్‌ను 10,000mAh బ్యాటరీ, 8000 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్‌తో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అలాగే Honor Power 2 మోడల్‌లో 10,080mAh బ్యాటరీతో పాటు 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే అందించింది. ఈ క్రమంలోనే త్వరలో తీసుకురాబోయే మొబైల్‌లో 10,000mAh బ్యాటరీతో పాటు 10,000నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్ అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే 10వేల నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్ అనేది వాస్తవ వినియోగంలో ఆ స్థాయిలో అనుభవం ఇవ్వకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త హానర్ ఫోన్‌లో 6.79 అంగుళాల డిస్‌ప్లే, 1200*2640 పిక్సెల్ రిజల్యూషన్, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించే అవకాశం ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగించే అవకాశం ఉంది. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ