కర్ణాటక గవర్నర్ కర్యాలయంలో రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం సిద్ధరామయ్య మంత్రులు డీకే శివకుమార్, పరమేశ్వరతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం సూచనలతో తాను సీఎం పదవికి రాజీనామా చేశానని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైదొలిగానని చెప్పారు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, దాన్ని గవర్నర్ ఆమోదిస్తారనే విశ్వాసం ఉందని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని, రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వ నిర్వహణలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమిచ్చిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడు కోట్ల మంది కర్ణాటక ప్రజలకు సేవచేసే అవకాశం లభించిందని చెప్పారు. రాజ్యాంగమే తమకు ధర్మమని, ప్రజలే తమకు దేవుళ్లని, హైకమాండ్ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటామని అన్నారు. అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని, పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ సిద్ధరామయ్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తాను పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానని, తమ కుటుంబంలో అంతకుముందు ఎవరూ రాజకీయాల్లో లేరని సిద్ధరామయ్య చెప్పారు. 2006లో కాంగ్రెస్‌లో చేరానని, పార్టీలో చేరినప్పటి నుంచి హైకమాండ్ తనను ఆదరించిందని అన్నారు. తాను సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రెండేసిసార్లు సేవలందించానని అన్నారు. తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, అందరికీ సమాన అవకాశాలు రావాలని కోరుకుంటానని చెప్పారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన 160 హామీల్లో 158 నెరవేర్చానని, మొదటి ఏడాదిలోనే ఐదు గ్యారెంటీలు అమలు చేశామని అన్నారు. తనపై ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేశాయని, అయినా వెనకడుగు వేయకుండా పనిచేశానని సిద్ధరామయ్య చెప్పారు. కాగా, ఈ సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ కానున్నాని తెలిసింది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి ఆ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య స్థానంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. శనివారం జరిగే సీఎల్పీ సమావేశంలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది.
గవర్నర్ కర్యాలయంలో రాజీనామా లేఖను సమర్పించిన సిద్ధరామయ్య
الخميس، 28 مايو 2026
expressed confidence that the Governor would accept it karnataka national Siddaramaiah Submits Resignation Letter at Governor's Office
ليست هناك تعليقات:
إرسال تعليق