ఇరాన్‌పై అమెరికా మిలిటరీ తాజాగా దాడులు చేసింది. ఇరానీ దళాల నుంచి తమ బలగాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తాజా అటాక్ చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. కాల్పుల విరమణ సమయంలో సంయమనం పాటిస్తూనే తమ దళాలను రక్షించుకునేందుకు దాడులకు దిగుతున్నట్లు సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపారు. బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న కొన్ని కేంద్రాలను టార్గెట్ చేసినట్లు కెప్టెన్ హాకిన్స్ చెప్పారు. దక్షిణ పోర్టు నగరంగా బందర్ అబ్బాస్‌కు పేరున్నది. ఇరానీ నౌకాదళానికి ఈ నగరమే బేస్. హోర్ముజ్ జలసంధి మార్గంలో ఈ పోర్టు సిటీ ఉంది. పేలుళ్ల ఘటనకు చెందిన అంశాలపై బందర్ అబ్బాస్ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు ఇరానీ మీడియా పేర్కొన్నది. తాజా దాడులపై ఇప్పటి వరకు ఇరాన్ మాత్రం స్పందించలేదు. అయితే ఈ దాడుల వల్ల అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి ఒప్పంద ప్రయత్నాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో అంచనా వేయలేకపోతున్నారు. అమెరికా తాజా దాడుల్లో నలుగురు ఇరానీ రెవల్యూషనరీ గార్డు సభ్యులు మృతి చెందినట్లు తెలిసింది. బందర్ అబ్బాస్ పోర్టు వద్ద ఈ ఘటన జరిగింది. అమెరికా దాడులు చేసినా.. ఇరాన్‌తో త్వరలో డీల్ కుదిరే అవకాశాలు ఉన్నట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఖతార్‌లో ఇవాళ చర్చలు జరగనున్నాయని, దీంట్లో ఏదైనా ప్రగతి జరుగుతుందో లేదో గమనించాలన్నారు.
إرسال تعليق