ఇంగ్లాండ్ చరిత్రలో అత్యంత పిన్నవయసులో మేయర్‌ పీఠాన్ని అధిరోహించిన భారతీయునిగా తుషార్‌ కుమార్‌ (23) చరిత్ర సృష్టించారు. గతంలో లండన్‌లోని కింగ్స్‌ కాలేజీలో తూర్పు ఇంగ్లండ్‌లోని ఒక స్థానిక కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ రాజకీయ నాయకుడు తుషార్‌ భారత్‌లో పుట్టారు. పదేళ్ల వయసులో ఇతని కుటుంబం బ్రిటన్‌కు వచ్చి స్థిరపడింది. కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన తుషార్ కుమార్, గత వారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్‌వుడ్' టౌన్ కౌన్సిల్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. లేబర్ పార్టీకి చెందిన ఈ కౌన్సిలర్ 2023లో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్‌వుడ్' టౌన్ కౌన్సిల్‌లో చేరారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన డిప్యూటీ మేయర్‌గా సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తుషార్ కుమార్ మాట్లాడుతూ "23 ఏళ్ల వయసులో, యునైటెడ్ కింగ్‌డమ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ సంతతి మేయర్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టడం నాకొక అద్భుతమైన గౌరవం" అని ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన స్థానిక ప్రజలకు, కౌన్సిలర్లకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Post a Comment

أحدث أقدم