జూన్ 15న మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ విడుదల

الأربعاء، 27 مايو 2026

automobile locally assemble this hybrid variant at its Chakan plant in Maharashtra Mercedes-Benz S-Class Launch on June 15 technology

t f B! P L


దేశీయ మార్కెట్లో జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ సెడాన్ 'మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్'  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జూన్ 15న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దేశంలోనే మొదటిసారిగా ఈ సిరీస్‌లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ సాంకేతికతను పరిచయం చేస్తున్నారు. మార్కెట్లో ధరలను పోటీగా ఉంచేందుకు వీలుగా ఈ హైబ్రిడ్ వేరియంట్‌ను మహారాష్ట్రలోని చాకన్ ప్లాంట్‌లో స్థానికంగానే అసెంబుల్ చేయాలని మెర్సిడెస్ యోచిస్తోంది. సరికొత్త సాఫ్ట్‌వేర్, అదిరిపోయే రేంజ్, ఇంటీరియర్ లగ్జరీతో వస్తున్న ఈ కారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సరికొత్త 'ఎస్ 450ఇ' (S 450e) మోడల్‌లో 3.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇన్‌లైన్-సిక్స్ ఇంజన్‌ను పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేశారు. ఇవి రెండూ కలిసి సంయుక్తంగా 435 Bhp పవర్‌ను, 680 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో అమర్చిన 22kWh బ్యాటరీ ప్యాక్ సహాయంతో కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఈ కారు గరిష్టంగా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. వేగం విషయానికి వస్తే, ఈ లగ్జరీ సెడాన్ కేవలం 5.7 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనితో పాటు స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ అయిన 'ఎస్ 450' కూడా లభిస్తుంది. ఇందులో 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇది 404hp పవర్‌ను జనరేట్ చేస్తూ, కేవలం 4.9 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అయితే, పాత డీజిల్ వేరియంట్ అయిన ఎస్ 350డి భవిష్యత్తుపై మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. కారు లోపలి భాగాన్ని సరికొత్త 'సూపర్‌స్క్రీన్' డ్యాష్‌బోర్డ్‌తో నెక్స్ట్ లెవెల్ లగ్జరీగా తీర్చిదిద్దారు. డ్రైవర్, కో-ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా 12.3-ఇంచుల డిస్‌ప్లేలు, అలాగే సెంటర్‌లో 14.4-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్‌ను అమర్చారు. ఈ కారు ద్వారా మెర్సిడెస్ తన సరికొత్త 'MB.OS' ఆపరేటింగ్ సిస్టమ్‌ను పరిచయం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఆధారిత డిజిటల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్‌తో ఈ కారు ఒక సాఫ్ట్‌వేర్ కమాండ్ సెంటర్‌లా పనిచేస్తుంది. వెనుక సీట్లలో కూర్చునే విఐపి ప్రయాణీకుల కోసం ముందరి సీట్ల వెనుక భాగంలో రెండు 13.1-ఇంచుల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లను ఇచ్చారు. పాత ట్యాబ్లెట్ కంట్రోలర్ స్థానంలో స్మార్ట్‌ఫోన్ లాంటి సరికొత్త టచ్ కంట్రోలర్లను వెనుక వైపు కేటాయించారు. అలాగే కారు ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా సాగడానికి అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, రియర్-వీల్ స్టీరింగ్ ఫీచర్లు ఇందులో స్టాండర్డ్‌గా వస్తున్నాయి. ఎక్స్‌టీరియర్ డిజైన్ పరంగా కూడా ఈ ఫేస్‌లిఫ్ట్ కారులో విప్లవాత్మక మార్పులు చేశారు. కారు ముందు భాగంలో ఉండే సిగ్నేచర్ గ్రిల్ పరిమాణాన్ని 20 శాతం పెంచి, దానికి ఎల్‌ఈడీ ఇల్యూమినేషన్ లైటింగ్ బోర్డర్‌ను జోడించారు. హెడ్‌ల్యాంప్‌లలో త్రీ-పాయింటెడ్ స్టార్ ఆకారంలో ఉండే డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), , తక్కువ విద్యుత్‌తో 40 శాతం ఎక్కువ వెలుతురును ఇచ్చే మైక్రో-ఎల్‌ఈడీ డిజిటల్ లైట్ టెక్నాలజీని ఉపయోగించారు. కారు వెనుక వైపు కూడా సరికొత్త స్టార్ సిగ్నేచర్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ అప్‌డేటెడ్ ఎస్-క్లాస్‌లో అధునాతన అడాస్ (ADAS) ప్యాకేజీని అందించారు. ఇందుకోసం కారు చుట్టూ 5 రాడార్లు, 10 కెమెరాలు , 12 అల్ట్రాసోనిక్ సెన్సార్లను అమర్చారు. ఈ సరికొత్త హంగులతో వస్తున్న 2056 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్.. భారతీయ అల్ట్రా-లగ్జరీ కార్ల మార్కెట్లో మళ్లీ తన నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ