ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణం 12వ పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ ప్రతి ఐదు ఏళ్లకు పీఆర్సీ అమలు చేయాలని నిబంధనలు ఉన్నాయని, చంద్రబాబు అమరావతిలో అద్దాల కోసం 2500 ఖర్చు చేస్తున్నారని ఉద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, దీనికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిదర్శనం అని అన్నారు.
12వ పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ధర్నా
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق