మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో ఒక చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ హోటల్ ఆవరణలో కోతిని తరిమివేసేందుకు ప్రయత్నించిన యువకుడు, విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారం ప్రకారం హోటల్ ఆవరణలోకి వచ్చిన కోతిని తరిమేందుకు సదరు యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప పైపును పైకి ఎత్తాడు. అయితే, అతని తల పైభాగంలోనే 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు వెళ్తున్నాయి. కోతిని కొట్టే క్రమంలో ఆ ఇనుప పైపు నేరుగా విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో విద్యుత్ ప్రవహించడంతో ఆ యువకుడు కుప్పకూలిపోయాడు.
కోతిని తరిమేందుకు ప్రయత్నించిన యువకుడు : హైటెన్షన్ వైర్లు తగిలి దుర్మరణం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق