తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో నకిలీ పత్తి విత్తనాల రవాణాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. మహారాష్ట్ర నుండి ప్రాణహిత నది గుండా తెలంగాణలోకి తరలిస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు, వారి వద్ద నుండి సుమారు 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్నారు. నెన్నెల గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మహారాష్ట్రలోని సిరోంచ గ్రామం నుండి నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో నుండి ప్రాణహిత నది మీదుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నారని పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా మహారాష్ట్ర నుండి ప్రాణహిత నది మీదుగా నాటు పడవల ద్వారా దాటించి నది ఒడ్డున గల ఆటోను తనిఖీ చేయగా ఆటోలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు. నకిలీ పత్తి విత్తనాలు వాడిన రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్టుగాని వినియోగిస్తున్నట్టుగాని తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
ホーム
/
Vemampalli Mandal
/
నకిలీ విత్తనాలు పట్టుకున్న పోలీసులు
Tuesday, April 21, 2026
Mancherial district Police Seize Counterfeit Seeds smuggling the seeds from Maharashtra into Telangana across the Pranahita River telangana Vemampalli Mandal
No comments:
Post a Comment