కరివేపాకు రుచి కోసం కాకుండా, జుట్టు పెరుగుదలకు, జీర్ణక్రియ మెరుగుపడటానికి , కంటి చూపును మెరుగుపరచడానికి మన పెద్దలు ప్రాచీన కాలం నుండి దీనిని ఒక గొప్ప ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా కరివేపాకుకు విశేషమైన స్థానం ఉంది. అయితే, “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లుగా.. ఏదైనా సరే అతిగా తీసుకుంటే ప్రమాదకరమే. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కరివేపాకును తీసుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో అది ఉన్న సమస్యను మరింత జటిలం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరివేపాకులో రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి వరప్రసాదం అయినప్పటికీ, ఇప్పటికే తక్కువ చక్కెర స్థాయిలతో ఇబ్బంది పడేవారు (లో-షుగర్ పేషెంట్లు) దీనిని అతిగా తీసుకుంటే వారి రక్తంలో గ్లూకోజ్ ప్రమాదకర స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల స్పృహ కోల్పోవడం, వణుకు , విపరీతమైన నీరసం వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది శరీరతత్వానికి కొన్ని రకాల సహజ వనరులు పడవు. కరివేపాకును ఆహారంలో తీసుకున్నప్పుడు లేదా నేరుగా తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వారు కరివేపాకుకు దూరంగా ఉండటమే మంచిది. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ఈ సమయంలో జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. కరివేపాకును రసం రూపంలో లేదా పొడి రూపంలో మోతాదుకు మించి తీసుకోవడం వల్ల వాంతులు, వికారం లేదా కడుపులో తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీలు తమ డైట్‌లో మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించాలి. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్న వారు కరివేపాకును ఔషధంగా వాడకూడదు. దీనిలోని కొన్ని ఖనిజ లవణాలు , మూలకాలు కిడ్నీ పనితీరుపై లేదా తీసుకుంటున్న మందుల ప్రభావంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కరివేపాకు జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, కడుపులో అల్సర్లు లేదా తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారు పచ్చి ఆకులను నేరుగా నమలడం వల్ల ఆమ్ల స్థాయిలలో మార్పులు వచ్చి కడుపులో మంట పెరిగే అవకాశం ఉంటుంది. కరివేపాకులో విటమిన్ ఏ, బీ, సీ , కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉన్న మాట వాస్తవమే. కానీ మీ ఆరోగ్య స్థితిని బట్టి దానిని ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ముఖ్యం. పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు ఆహారంలో తక్కువ మొత్తంలో వాడుకోవచ్చు కానీ, ఔషధంలా నేరుగా అధిక మొత్తంలో తీసుకోవడం మాత్రం శ్రేయస్కరం కాదు.
ホーム
/
vitamins A
/
కరివేపాకు - మంచి - చెడు
السبت، 11 أبريل 2026
and C arogyam as well as calcium ayurvedam B Curry Leaves: The Pros and Cons excess in all things is to be avoided Health Tips vitamins A
ليست هناك تعليقات:
إرسال تعليق