అమెరికన్ పొలిటికల్ వ్యాఖ్యాత, రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ భారతీయులు, చైనీయులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ట్రంప్ సమర్థిస్తూ రీపోస్ట్ చేశారు. భారత్, చైనా ఇతర దేశాలను ''నరకాలు''గా అభివర్ణించారు. అమెరికాలో పుట్టుక ద్వారా వచ్చే జన్మహక్కు పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాలని సావెజ్ కోరారు. ఈ రెండు దేశాల ఆసియా ప్రజలు తొమ్మిదవ నెలలో బిడ్డను కనడానికి అమెరికాకు వస్తారని ఆరోపించారు. అమెరికా జన్మహక్కు పౌరసత్వంపై సుప్రీంకోర్టు వాదనల్ని సావేజ్ తీవ్రంగా విమర్శిస్తూ, చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమెరికాలో జన్మహక్కు పౌరసత్వం ద్వారా ఇక్కడ ఒక బిడ్డ అమెరికన్ పౌరుడిగా మారుతారని, ఆ తర్వాత చైనా, భారత్ ఇతర నరకూపాల నుంచి వారి మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకువస్తారని అన్నాడు. భారత్, చైనా వలసదారుల్ని ''ల్యాప్ టాప్ కలిగిన గ్యాంగ్‌స్టర్లు''గా అభివర్ణించారు. మాఫియా కుటుంబాలు ఈ దేశానికి చేసిన నష్టాని కన్నా వీరే ఈ దేశానికి ఎక్కువ నష్టం చేస్తారని ఆరోపించారు. భారతీయుల వల్ల అమెరికాలోని ప్రజలకు అవకాశాలు తగ్గాయని అన్నారు. సావేజ్ పోస్టునే ట్రంప్ రీపోస్ట్ చేశారు. ట్రంప్ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా తప్ప ప్రపంచంలో ఏ దేశం కూడా బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఇవ్వదని చెప్పారు. నిజానికి మెక్సికో, కెనడా వంటి అనేక దేశాలు ఇలా పౌరసత్వాన్ని ఇస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా వీసా విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నారు. ఈమేరకు ఆటోమేటిక్ పౌరసత్వాన్ని నిలిపివేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కూడా జారీ చేశాడు. అయితే, అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం జన్మహక్కు పౌరసత్వం హామీ ఉంటుందని అమెరికన్ న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిపై అక్కడి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
మైఖేల్ సావేజ్ జాత్యాంహకార వ్యాఖ్యలు : సమర్థిస్తూ రీపోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
Thursday, April 23, 2026
and other nations as "hellholes china China as gangsters with laptops Donald Trump Reposts in Support india international Michael Savage's Racist Remarks
No comments:
Post a Comment