హైదరాబాద్, మాసాబ్‌ట్యాంక్‌లోని విజయ్‌నగర్ కాలనీలో గల హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం సెంటర్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే మెహదీపట్నం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా లేదా ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అనే కోణంలో సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు. 

Post a Comment

أحدث أقدم