భార్య వేధింపులు భరించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న భర్త !

الخميس، 9 أبريل 2026

crime Husband Commits Suicide by Jumping Under a Train national Near Kalyan in Maharashtra Unable to Endure Wife's Harassment

t f B! P L


హారాష్ట్రలోని కళ్యాణ్ సమీపంలో కట్టుకున్న భార్య, అత్తమామల వేధింపులు తట్టుకోలేక, కన్నతల్లిని, సోదరిని వదులుకోలేక ఒక మధ్యవయస్కుడు రైలు కింద పడి తనువు చాలించాడు. ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు రాసిన డెత్ నోట్‌లో తన భార్య తనను ఎలా హింసించిందో వివరించిన తీరు చదువుతుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. రవికాంత్ అడంగలే (49) అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్య రష్మి, తన తల్లి, సోదరితో కలిసి నివసిస్తున్నారు. వీరికి 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఏప్రిల్ 3వ తేదీ అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో అంబర్‌నాథ్ మరియు బద్లాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రవికాంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు లభించిన డెత్ నోట్‌లో రవికాంత్ తన ఆవేదననంతా వెళ్లగక్కారు. తన చావుకు భార్య రష్మి, అత్త అరుణ, ఆవిడ సోదరి సునీతలే కారణమని స్పష్టంగా పేర్కొన్నారు. గత కొంతకాలంగా వారు తనను శారీరకంగా, మానసికగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భార్య రష్మి తన భర్తకు, అత్తకు, ఆడపడుచుకు వంట చేసి పెట్టడానికి నిరాకరించేది. దీంతో రవికాంత్ బయటే భోజనం చేయాల్సి వచ్చేదని, భర్త తన తల్లిని, సోదరిని వదిలేసి తనతో మాత్రమే వేరుగా ఉండాలని రష్మి నిరంతరం ఒత్తిడి చేసేదని, ఇందుకు రవికాంత్ ఒప్పుకోకపోవడంతో ఇంట్లో ప్రతిరోజూ నరకం చూపించేదని, అత్తగారి తరపు బంధువులు కూడా తోడై తనను వేధించడంతో రవికాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను భార్య రష్మి, అత్త మరియు ఆవిడ సోదరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108, 352 మరియు 3(5) కింద కేసులు నమోదు చేశారు. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పండరీ కందే మాట్లాడుతూ, "కుటుంబ కలహాల వల్లే ఈ ఆత్మహత్య జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కేసు నమోదు చేశాం, తదుపరి విచారణ కొనసాగుతోంది" అని తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ