తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని వెంగన్నపేట గ్రామ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ధాన్యం లారీ బోల్తా పడి లారీ క్లీనర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంగన్నపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు చేసి లారీలో లోడ్ చేసుకొని వెంగన్నపేట గ్రామంలో నుంచి రాజమండ్రికి వెళ్తున్న క్రమంలో గూడూరు, మిట్టపల్లి గ్రామ సమీపంలో ఉన్న వంతెన వద్ద లారీ బోల్తా పడింది. దీంతో లారీ క్లీనర్ మడక జోగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణం దీనికి తోడు ప్రత్యామ్నాయం రోడ్డు లేకపోవడంతో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించడానికి సరైన స్థలం లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా లారీ డ్రైవర్ సాలెపు సంతోష్ కుమార్ మద్యం మత్తులో ఉండటం ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రధాన కారణంగా స్థానికులు తెలిపారు. మృతుడు అనకాపల్లి జిల్లా మడక పాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

أحدث أقدم