గూగుల్ వాలెట్ యాప్‌లో కొత్త ఫీచర్ : ఆధార్ బేస్డ్ డిజిటల్ ఐడీని వాలెట్‌లోకి చేర్చుకునే సదుపాయం

الثلاثاء، 28 أبريل 2026

Facility to Add Aadhaar-Based Digital ID to the Wallet identity verification processes will become faster and more convenient New Feature in Google Wallet App technology

t f B! P L


గూగుల్ ఆధార్ బేస్డ్ డిజిటల్ ఐడీని వాలెట్‌లోకి చేర్చుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ తమ ఆధార్ కార్డు వివరాలను స్మార్ట్‌ఫోన్‌లలో సురక్షితంగా స్టోర్ చేసుకుని, ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుంది. దీని ద్వారా ఐడెంటిటీ చెక్ మరింత వేగంగా, సులభంగా జరుగుతుంది. డిజిటల్ ఐడీ సహాయంతో ఫిజికల్ వాలెట్ అవసరం లేకుండానే ఐడెంటిటీని నిరూపించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. గూగుల్ వాలెట్ ఇప్పుడు భారతదేశంలో ఆధార్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్స్‌కు సపోర్ట్ చేస్తోంది. అంతేకాకుండా, పాస్‌పోర్ట్ సమాచారం ఆధారంగా పనిచేసే సురక్షితమైన డిజిటల్ ఐడీలైన ఐడీ పాస్‌లను సింగపూర్, తైవాన్ , బ్రెజిల్‌లకు కూడా విస్తరిస్తున్నామని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. గూగుల్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఇండియన్ యూజర్స్ వారి ఆధార్‌ను గూగుల్ వాలెట్‌కు సులభంగా యాడ్ చేసుకోవచ్చు, ఫిజికల్ కార్డు అవసరం లేకుండానే సులభంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో రూపొందించినట్లు, ఇది అధికారిక ప్రమాణాలు, భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ప్రక్రియలో గోప్యత, భద్రత ప్రధానమైన వని గూగుల్ చెబుతోంది. దీని ద్వారా ఆధార్ క్రెడెన్షియల్స్‌లో ఎంపిక చేసిన డేటాను షేర్ చేసుకోవడం వంటి అధునాతన ఫీచర్లను ఉపయోగిస్తుంది. అంటే, వెరిఫికేషన్ సమయంలో పూర్తి వివరాలకు బదులుగా, అవసరమైన సమాచారాన్ని మాత్రమే పంచుకుంటుంది. ఇది పర్సనల్ డేటాను అధికంగా షేర్ చేయడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గూగుల్‌ వాలెట్‌లోకి ఈ డిజిటల్ ఆధార్ ఐడీ రోజు వారి వివిధ అవసరాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. PVR INOX వంటి సినిమా థియేటర్లలో గూగుల్ వాలెట్‌లోని డిజిటల్ ఐడీ ద్వారా సులభంగా ఐడెంటిటీని వెరిఫై చేసుకోవచ్చు. భారత్‌మ్యాట్రిమోనీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వెరిఫై చేసిన ప్రొఫైల్‌లను ఉపయోగించుకోవచ్చు, లేదా అట్లిస్ ద్వారా వీసా దరఖాస్తులను సులభంగా, వేగంగా చేయవచ్చు. మైగేట్ ద్వారా గేటెడ్ కమ్యూనిటీ యాక్సెస్ , గిగ్ వర్కర్ వెరిఫికేషన్ వంటి ఇతర సర్వీసెస్‌ కూడా త్వరలో ఈ ఫీచర్‌ను స్వీకరించే అవకాశం ఉంది. వాలెట్‌లో స్టోర్ చేయబడిన ఆధార్ డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుందని , స్క్రీన్ లాక్ లేదా బయోమెట్రిక్స్ వంటి డివైజ్ సెక్యూరిటీ ఫీచర్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుందని గూగుల్ వెల్లడించింది.దీంతో వినియోగదారులకు తమ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుందని, తమ డిజిటల్ ఆధార్ ఐడీని ఎప్పుడు, ఎక్కడ షేర్ చేసుకోవాలో వారే సెలెక్ట్ చేసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. అకౌంట్స్‌లోకి సైన్ ఇన్ చేయాల్సి వచ్చినప్పుడు పర్సనల్, ఆన్‌లైన్ సేవలకు ఐడెంటిటీ లేదా వయస్సును వెరిఫై చేయడానికి డిజిటల్ ఆధార్ ఐడీ ఒక సులభమైన,గోప్యమైన మార్గమని గూగుల్ కంపెనీ పేర్కొంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ