రాజస్థాన్ లోని అజ్మీర్ పర్యటనకు వెళ్లినప్పటి నుంచి మోనాలిసా ఆచూకీ కనిపించకుండా పోయిందంటూ ఆమెను పెళ్లాడిని ఫర్మాన్ ఖాన్ ఓ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. కాగా మోనాలిసా 16 ఏళ్ల మైనర్ బాలిక అనీ, ఈ క్రమంలో ఫర్మాన్ పైన పోక్సో కేసు నమోదైంది. ఇప్పుడు మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్ వీడియో విడుదల చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది. మోనాలిసా వివాహంలో ట్విస్ట్ చోటుచేసుకున్నది. ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పైన మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు పెట్టారు. మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలే కావడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మార్చి 11న కేరళం లోని తిరువనంతపురంలోని అరుమనూర్ దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి కేరళం విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టితో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే పెళ్లయ్యాక మోనాలిసా వయసు గురించి తీవ్ర చర్చ జరిగింది. దీనితో ఆమె వయసుపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో... మోనాలిసా డిసెంబర్ 30, 2009లో జన్మించినట్లు వున్నది. పెళ్లి చేసుకునే నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఈ విషయం తెలిసి కూడా మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ఇద్దరూ నకిలీ పత్రాలు సృష్టించి పెళ్లిని రిజిస్టర్ చేయించినట్లు తేలింది. కాగా దంపతులిద్దరూ తమకు సమర్పించిన ఆధార్ కార్డులు ఆధారం చేసుకుని వివాహం జరిపించామని ఆలయ పెద్దలు వెల్లడించారు. ఐతే ఫేక్ పత్రాలు సమర్పించి వివాహం చేసుకున్నందుకు మోనాలిసా భర్తపై పోక్సో కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
అజ్మీర్ వచ్చాక మోనాలిసా మిస్ అయ్యింది : భర్త ఫర్మాన్ ఖాన్ సెల్ఫీ వీడియో పోస్ట్
الاثنين، 13 أبريل 2026
Madhya Pradesh police have filed a POCSO case Monalisa Goes Missing After Arriving in Ajmer: Husband Farman Khan Posts Selfie Video
ليست هناك تعليقات:
إرسال تعليق