ఇండిగో సంస్థ కొత్త సీఈఓగా విలియం వాల్ష్‌ను నియమించింది. ఈయన బ్రిటిష్ ఎయిర్‌వేస్ మాజీ చీఫ్ కావడం విశేషం. అంతకుముందు ఇండిగో సీఈఓగా పీటర్ ఎల్బర్స్ ఉండగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఇప్పుడు వాల్ష్‌తో భర్తీ చేసింది. ప్రస్తుతం వాల్ష్.. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. జులై 31తో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. ఆగస్ట్ 3 తర్వాత ఇండిగో సీఈఓగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గత సంవత్సరం డిసెంబరులో సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. అప్పుడు ప్రయాణికుల సర్వీసులపై తీవ్ర అంతరాయం పడింది. ఇండిగోపై విమర్శలు కూడా భారీ స్థాయిలో వచ్చాయి. దీంతో పీటర్ ఎల్బర్స్ పదవీ కాలం ముగియడానికి 18 నెలల ముందుగానే అకస్మాత్తుగా రాజీనామా చేశారు. 

Post a Comment

أحدث أقدم