చార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనం కోసం తెరుచుకున్నాయి. శీతాకాలం విరామం అనంతరం శివయ్య సన్నిధిలో మళ్ళీ ఆధ్యాత్మిక కోలాహలం మొదలైంది. కేదార్‌నాథ్ ఆలయ పునఃప్రారంభం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని టన్నుల కొద్దీ రంగురంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మరియు డప్పు వాయిద్యాల మధ్య ఆలయ తలుపులు తీశారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. హిమాలయాల్లో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ, భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు.
భక్తుల కోసం తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు
الأربعاء، 22 أبريل 2026
a spiritual fervor has once again enveloped the sacred abode of Lord Shiva Bhakthi Following the winter recess Kedarnath Temple Gates Open for Devotees national
ليست هناك تعليقات:
إرسال تعليق