హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ 'హేట్ స్పీచ్'లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో బిల్లును పాస్ చేశారని అన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పరిధిలోకి రావా అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లను విష సర్పాలని ఖర్గే సంబోధించడాన్ని లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఉండి ప్రత్యర్థులను విషపూరిత పాములతో పోల్చడం, ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని, దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించాల్సిన నేతలే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల్లో విద్వేషాలు నింపేలా మాట్లాడటం హేట్ స్పీచ్ కిందికే వస్తుందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని తెలపాలని లక్ష్మణ్ అన్నారు.
మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు హేట్ స్పీచ్ కిందికే వస్తాయి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
الأربعاء، 8 أبريل 2026
BJP MP Laxman Mallikarjun Kharge's Remarks Amount to Hate Speech Speaking to the media in Hyderabad telangana Telangana government to clarify its stance on the matter
ليست هناك تعليقات:
إرسال تعليق