అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ నివాసమే లక్ష్యంగా ఈ నెల ప్రారంభంలో టెక్సాస్‌కు చెందిన డేనియల్ మోరెనో-గామా అనే వ్యక్తి మోలోటోవ్ కాక్టెయిల్ (పెట్రోల్ బాంబు)తో ఆల్ట్‌మాన్ ఇంటిపై దాడికి దిగాడు. అనంతరం ఓపెన్‌ఏఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆల్ట్‌మాన్‌కు హాని కలిగించే ఉద్దేశంతోనే టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. నిందితుడి వద్ద ఏఐ విధానానికి వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు ఏఐ పరిశ్రమ దిగ్గజాల పేర్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు హత్యాయత్నంతో పాటు పలు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై స్పందించిన సామ్ ఆల్ట్‌మాన్ ఇది తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని పేర్కొన్నారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని సంస్థలు చేస్తున్న అతివాద ప్రచారం సామాన్యులలో అనవసర భయాందోళనలు కలిగిస్తోందని ఆయన వాదించారు. 'ఏఐ ప్రమాదాల గురించి ప్రత్యర్థి సంస్థలు, ముఖ్యంగా ఆంత్రోపిక్ వంటి ల్యాబ్స్ అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సహేతుకం కాదు. ఇది ప్రజల్లో విద్వేషాన్ని పెంచుతోంది' అని ఆల్ట్‌మాన్ విమర్శించారు. ఓపెన్‌ఏఐ నుంచి విడిపోయి డారియో అమోడి నేతృత్వంలో స్థాపించబడిన ఆంత్రోపిక్ సంస్థకు, ఆల్ట్‌మాన్ సంస్థకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఓపెన్‌ఏఐ అనుసరిస్తున్న విధానాలను అమోడి గతంలో 'సేఫ్టీ థియేటర్' (ప్రదర్శన కోసం చేసే భద్రత) అని విమర్శించారు. దీనికి ప్రతిగా ఆంత్రోపిక్ తన వ్యాపార ప్రయోజనాల కోసం భయాన్ని పెట్టుబడిగా పెడుతోందని ఆల్ట్‌మాన్ ఆరోపిస్తున్నారు.
ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇంటిపై దాడి : నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు
الأربعاء، 22 أبريل 2026
OpenAI CEO Sam Altman's Home Attacked Police Take Suspect into Custody technology Texas resident named Daniel Moreno-Gama
ليست هناك تعليقات:
إرسال تعليق