2027 మార్చి 14న 99వ ఆస్కార్ వేడుకను, అలాగే 100వ ఆస్కార్ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించబోతున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. అయితే ఇటీవల ఈ వేడుకల నిర్వహణ గురించి అకాడెమీ ఓ ప్రకటన చేసింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న డాల్బీ థియేటర్ వేదికను వదిలి, 2029 నుంచి లాస్ ఏంజిల్స్‌లోని పీకాక్ థియేటర్‌లో ఈ వేడుకలను నిర్వహించాలని అకాడమీ నిర్ణయించింది. అంతేకాకుండా దశాబ్దాల పాటు కొనసాగిన టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌కు స్వస్తి పలుకుతూ, 2029 నుండి ఆస్కార్ వేడుకలను నేరుగా యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబోతున్నారు. 2026-2027 అవార్డుల సీజన్‌కు సంబంధించి, 2026 ఏడాది పొడవునా విడుదలయ్యే సినిమాలు అవార్డులకు అర్హత పొందుతాయని, 2027 జనవరి 21న నామినేషన్లను ప్రకటిస్తామని అకాడమీ స్పష్టం చేసింది.
2027 మార్చి 14న 99వ ఆస్కార్ వేడుక, 2028 మార్చి 5న 100వ ఆస్కార్ వేడుక !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق