మహారాష్ట్రలో మహమ్మద్ అయాజ్ అనే కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్, స్నాప్‌చాట్ వేదికలుగా వందలాది మంది అమ్మాయిలను ట్రాప్ చేసి, వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాడు. నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలను లోబర్చుకుని, వారిని ముంబై, పుణే నగరాలకు తీసుకువెళ్లి లైంగికంగా వేధించడమే కాకుండా సుమారు 350 న్యూడ్ వీడియోలను చిత్రీకరించాడు. ఆ వీడియోలతో బెదిరిస్తూ కొందరిని వ్యభిచారంలోకి కూడా దింపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బీజేపీ ఎంపీ అనిల్ బోండేకు అందిన ఒక వినతిపత్రం ఆధారంగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో చట్టం సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.
0 Comments