తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల్ శంకర్‌గౌడ్ మృతదేహానికి నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున శంకర్ గౌడ్ కుటుంబానికి పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా, మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతిరెడ్డి మాధవరెడ్డి రూ.5లక్షలు సహాయం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే మిగిలిన మూడు హామీల విషయంలో తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫు అధికారులు ఆర్టీసీ జేఏసీని విజ్ఞప్తి చేశారు. మూడు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబడుతోంది.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం : రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా
الجمعة، 24 أبريل 2026
₹10 Lakh Ex-Gratia Announced Government Job for RTC Driver Shankar Goud's Son Narsampet MLA Donthireddy Madhava Reddy also provided financial assistance of ₹5 lakhs telangana
ليست هناك تعليقات:
إرسال تعليق