ఇరాక్ రాజధాని బగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అమెరికా దౌత్య మద్దతు కేంద్రంపై ఇరాన్ దాడిచేసింది. ఆరు డ్రోన్లు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోగా, ఐదింటిని అమెరికా రక్షణ వ్యవస్థలు గాలిలోనే కూల్చివేశాయి. అయితే, ఒక డ్రోన్ మాత్రం కార్యాలయ ప్రాంగణాన్ని తాకడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం.బుధవారం. సూర్యోదయానికి ముందే ఇరాన్ తన క్షిపణి ఛత్రాన్ని విప్పింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, హైఫా నగరాలను లక్ష్యంగా చేసుకుని భారీగా క్షిపణులను ప్రయోగించింది. అలాగే, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నావికా దళానికి చెందిన స్థావరంపై కూడా ఇరాన్ దాడులు చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ అంతటా భీకరమైన వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.
إرسال تعليق