పాలకూర - ఆరోగ్య ప్రయోజనాలు

Monday, March 9, 2026

arogyam but also prevents problems like anemia food improves eyesight rich in vitamins and minerals Spinach - Health Benefits superfood among green vegetables

t f B! P L


ఆకుకూరల్లో పాలకూరను సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా, రక్తహీనత వంటి సమస్యలు దరిచేరవు.చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య రక్తహీనత. పాలకూరలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా దీన్ని తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల బాడీలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి, మీరు రోజంతా నీరసంగా ఉండకుండా చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి మరియు ఎదుగుతున్న పిల్లలకు ఇది ఒక వరప్రసాదం లాంటిది. పాలకూరలో ఉండే ‘లూటిన్’ మరియు ‘జియాక్సాంతిన్’ అనే పదార్థాలు కంటి చూపును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి కంటిలోని రెటినాను రక్షించి, వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తాయి. ఎముకలు బలంగా ఉండాలంటే కేవలం క్యాల్షియం మాత్రమే సరిపోదు, విటమిన్-కె కూడా చాలా అవసరం. పాలకూరలో ఈ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచి, చిన్న వయసులోనే వచ్చే కీళ్ల నొప్పులను నివారిస్తుంది.ఇక పాలు తాగడానికి ఇష్టపడని వారు పాలకూరను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇది మీ ఎముకల పటుత్వాన్ని పెంచి, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. బీపీ కంట్రోల్!: పాలకూరలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయి. ఇక తద్వారా గుండెపోటు వంటి ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పాలకూర బయటి అందానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఎ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్-సి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. జుట్టు రాలడం సమస్యతో బాధపడేవారు పాలకూర తీసుకుంటే, అందులోని పోషకాలు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహకరిస్తాయి.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ