ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్ లోని గాంధీ ఆస్పత్రి ధ్వంసమయ్యింది. దీంతో వైద్యులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. పేషెంట్లను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ఆస్పత్రులపై దాడులు చేయడం ఆందోళనకరమని తెలిపారు. ఆస్పత్రులు, ఆరోగ్య వసతులపై దాడులను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దాడిపై ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి స్పందించారు. గాంధీ ఆస్పత్రిని ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు. మరో మూడు ఇతర ఆస్పత్రులపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు.
టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిపై దాడులు : ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق