తెలంగాణలోని కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 18న ఆయన భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సీతంపేటకు చెందిన దివ్య (30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరు కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఉంటుండగా చంద్రశేఖర్ టూ టౌన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. చంద్రశేఖర్ రోజు మాదిరిగా మంగళవారం ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లాడు. కాగా ,దివ్య కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె గన్నేరు పూలు, ఆకులు మిక్సీ వేûసుకొని తాగింది. విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. సమాచారం తెలిసిన భర్త దివ్యను హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, దివ్య మృతికి చంద్రశేఖర్ కారణమని.. ఆమె అంత్యక్రియల సందర్భంగా ఎస్ఐపై సీతంపేట గ్రామస్తులు దాడి చేశారు. ఆ సమయంలో ఆ దాడిని దివ్య తండ్రి అడ్డుకోవడం గమనార్హం. ఈ క్రమంలో భార్య మృతిని తట్టుకోలేని చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య
السبت، 21 مارس 2026
SI Chandrashekhar Commits Suicide in Karimnagar telangana unable to cope with the loss of his wife wife Divya had committed suicide earlier this month
ليست هناك تعليقات:
إرسال تعليق