ఇన్‌స్టాగ్రామ్ లో రెగ్యులర్ టెక్స్ట్ మెసేజ్‌లతో బోర్‌గా ఫీల్ అవుతున్న వారి కోసం, మరీ ముఖ్యంగా డైరెక్ట్ మెసేజెస్‌లో వాయిస్ నోట్స్ పంపే యూజర్ల కోసం ఏఐ వాయిస్ ఎఫెక్ట్స్‌ను మెటా పరిచయం చేసింది. దీని ద్వారా మీ సాధారణ గొంతును విభిన్న పాత్రలు మాట్లాడుతున్నట్లు మార్చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ తన తాజా అప్‌డేట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నేరుగా వాయిస్ నోట్స్‌కు కనెక్ట్ చేసింది. మీరు ఎవరికైనా వాయిస్ మెసేజ్ పంపేటప్పుడు, మీ గొంతును రకరకాల ఎఫెక్ట్స్‌తో మార్చుకోవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల మీ గొంతులోని ఎమోషన్, రిథమ్ ఏమాత్రం మిస్ అవ్వదు. వినడానికి మాత్రం ఒక రోబోలా లేదా ఏలియన్‌లా వినిపిస్తుంది. చాటింగ్‌ను మరింత సరదాగా మార్చడం, వాయిస్ మెసేజ్ వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా మెటా దీన్ని డిజైన్ చేసింది. ఈ ఫీచర్‌ను వాడటం చాలా సులభం. ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. అప్‌డేట్ చేసిన వెంటనే కనిపించకపోతే ఒకట్రెండు రోజులు వేచి చూడాలి. ఎందుకంటే ఈ ఫీచర్ క్రమంగా అందరికీ రోల్ ఔట్ అవుతోంది. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి ఎవరికైనా మెసేజ్ పంపాలనుకున్న చాట్ బాక్స్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ ఉండే మైక్రోఫోన్ గుర్తును నొక్కి పట్టుకుని లేదా పైకి స్వైప్ చేసి రికార్డింగ్‌ను లాక్ చేసి మాట్లాడటం ప్రారంభించాలి. రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీకు వేవ్‌ఫామ్ పక్కన కొత్తగా ఒక ఎఫెక్ట్స్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు విభిన్న రకాల ఆప్షన్లు వస్తాయి. అందులో చిప్‌మంక్ (చిన్న పిల్లల గొంతు), డెమన్ (లోతైన గంభీర స్వరం), రోబో, ఏలియన్, అండర్ వాటర్ (నీటి లోపల నుంచి మాట్లాడుతున్నట్లు), స్టేడియం లాంటి ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. మీరు మెసేజ్ సెండ్ చేసే ముందే ఆ వాయిస్ ఎలా ఉందో స్వయంగా వినవచ్చు. మీకు నచ్చిన ఎఫెక్ట్ ఎంచుకుని మెసేజ్ సెండ్ చేయడమే. మీరు పంపిన మెసేజ్ కింద ఏ ఎఫెక్ట్ వాడారో అవతలి వ్యక్తికి స్పష్టంగా లేబుల్ రూపంలో కనిపిస్తుంది. మీ స్నేహితులు ఎవరైనా మీకు ఇలాంటి వాయిస్ ఎఫెక్ట్ మెసేజ్ పంపితే, మీరు కూడా అదే ఎఫెక్ట్‌తో వారికి వెంటనే రిప్లై ఇవ్వవచ్చు. ఆ మెసేజ్ కింద ఉండే ఎఫెక్ట్ లేబుల్ మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్‌గా మీ రికార్డింగ్‌కు కూడా అదే ఎఫెక్ట్ అప్లై అయిపోతుంది. దీని కోసం మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఏవీ వాడాల్సిన అవసరం లేదు. అంతా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోనే సింపుల్‌గా జరిగిపోతుంది. ఈ ఫీచర్ ఎంత సరదాగా ఉన్నా, ప్రైవసీ విషయంలో యూజర్లు కాస్త అప్రమత్తంగా ఉండాలి.
إرسال تعليق