కవ్వాల్ టైగర్ జోన్‌లో చిరుత పులి మృతి : ముగ్గురు వేటగాళ్ల అరెస్టు

السبت، 14 مارس 2026

Jannaram Mandal Leopard Dies in Kawal Tiger Zone Mancherial district Officials seized leopard claws from their possession telangana Three Poachers Arrested

t f B! P L


తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తాళ్లపేట రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన అటవీ శాఖ వర్గాల్లో కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత కనిపించకపోవడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాళ్లపేట రేంజ్ పరిధిలో చిరుత కళేబరాన్ని గుర్తించారు. ఈ ఘటనపై అటవీశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది వేటగాళ్ల పనిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా అటవీ శాఖ ప్రత్యేక బృందాలు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి చిరుత గోర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల అవయవాల స్మగ్లింగ్ ముఠాతో వీరికి ఏవైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్-1 జాబితాలో ఉన్న చిరుతను వేటాడం తీవ్రమైన నేరం. పట్టుబడిన నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ