ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం సమీపంలోపి ఓ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ద్వంసమవ్వడంతో పాటు కార్లలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహన దారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారికి అంబులెన్స్ సహాయంలో హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం కార్లలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్లైఓవర్‌పై ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు : ముగ్గురు దుర్మరణం, నలుగురికి తీవ్ర గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق