బెంగళూరులో చిలుక జోస్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన శేఖర్ (59) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖలో పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న సత్యనారాయణను నిందితుడు ముఖం చూసి భవిష్యత్తు చెబుతానంటూ నమ్మించాడు. కెరీర్ ఎదుగుదల, బదిలీలు వంటి ఆశలు చూపించాడు. ఇందుకు పూజలు, క్రతువు చేయాలని ఆ అధికారిని ఒప్పించాడు. ఇందుకోసం రూ. 50,000 చెల్లించేలా చేశాడు. ఆ తరువాత మరింత శక్తివంతమైన పూజలు చేస్తేనే దోషాలు తొలగిపోతాయని నమ్మించాడు. ఇలా సుమారు రూ. 35 లక్షల విలువైన 194 గ్రాముల బంగారం, 1.3 కిలోల వెండి వస్తువులను కాజేశాడు. చివరికి అనుమానం వచ్చి విలువైన తన వస్తువులను తిరిగి ఇవ్వమని అడగడంతో చిలుక జ్యోతిష్యుడి అసలు బండారం బయట పడింది. అధికారి వెండి, బంగారు వస్తువులను తిరిగి ఇవ్వలేదు సరికదా ఎదురు బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు భారతీనగర్ పోలీసులను ఆశ్రయించాడు. మార్చి5 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి 12న కాంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. విలువైన వస్తువులను హలసూరులోని ఒక జ్యువెలరీ షాపులో అమ్మేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతను చెప్పిన దాని ఆధారంగా పోలీసులు 124 గ్రాముల బంగారం, 796 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 20.60 లక్షలు. మార్చి 17న నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే తాను ఈ మోసానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. విచారణలో భాగంగా, నిందితుడు జ్యోతిష్యం, చిలుక జ్యోతిష్య సేవలను అందిస్తానని చెబుతూ, ఇదే తరహాలో మరికొంతమందిని కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసం ద్వారా సేకరించిన డబ్బు, బంగారాన్ని నిందితుడు ఎక్కడికి తరలించాడనే విషయంపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
చిలుక జోస్యం పేరుతో ఐటీ అధికారిని దోచుకున్న మోసగాడు !
Thursday, March 19, 2026
Bengaluru collectively valued at approximately Rs 35 lakhs Conman Robs IT Official Under the Guise of Parrot Astrology crime he swindled 194 grams of gold and 1.3 kilograms of silver articles karnataka
No comments:
Post a Comment