తెలంగాణ రైతులకు యూరియాను ఉచితంగా సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. సాగులో కీలకమైన యూరియాను ఉచితంగా అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. 'రైతు భరోసా' నిధుల విడుదలలో సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతున్న తరుణంలో ఈ ఉచిత ఎరువుల పంపిణీ రైతులకు తక్షణ ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ఆర్థిక శాఖ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీని వల్ల ఎరువుల కొనుగోలు కోసం రైతులు అప్పులు చేయాల్సిన అవసరం తప్పుతుంది. నగదు బదిలీలో జాప్యం జరిగినప్పటికీ.. వస్తు రూపంలో (యూరియా) సాయం అందడం వల్ల సాగు పనులు ఆగవు. సరైన సమయంలో ఎరువులు అందుబాటులోకి రావడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం ఈ పథకం కోసం అయ్యే మొత్తం ఖర్చు, జిల్లాల వారీగా ఉన్న యూరియా డిమాండ్ , పంపిణీ విధానంపై తుది కసరత్తు చేస్తోంది.
తెలంగాణ రైతులకు ఉచితంగా యూరియా పంపిణీ ?
الاثنين، 16 مارس 2026
Department of Agriculture has intensified its efforts to supply urea free of cost to farmers Free Urea Distribution for Telangana Farmers? telangana
ليست هناك تعليقات:
إرسال تعليق