హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని లేక్ షేర్ మాల్‌లో ప్రమాదం జరిగింది. సందర్శకులపై హోర్డింగ్‌లు, యాడ్ బోర్డులు పడ్డాయి. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో మాల్‌లో జనసంచారం తక్కువగా ఉంది. ఈ సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదమే తప్పింది. హోర్డింగ్‌లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒక్కసారిగా వినియోగదారులంతా భయంతో పరుగులు తీశారు. మాల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కూకట్‌పల్లి లేక్ షేర్ మాల్‌లో ప్రమాదం : హోర్డింగ్‌లు, యాడ్ బోర్డులు పడి పలువురికి గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق