దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, వారికి ప్రభుత్వ పథకాలను నేరుగా అందించేందుకు రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఇది పూర్తిగా ఆన్‌లైన్, పేపర్‌లెస్ , ఉచిత ప్రక్రియ. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే అది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఎటువంటి ఆస్తులు కుదవ పెట్టకుండానే బ్యాంకుల నుండి వ్యాపార రుణాలు పొందవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్రెడిట్ గ్యారెంటీ పథకాలను అమలు చేస్తోంది. సాధారణ రుణాలతో పోలిస్తే ఉద్యమ్ సర్టిఫికేట్ ఉన్న వ్యాపారాలకు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. సరఫరా చేసిన పెద్ద కంపెనీలు 45 రోజుల్లోపు డబ్బు చెల్లించకపోతే, 'ఎంఎస్ఎంఈ సమాధాన్' ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వారు వడ్డీతో సహా మీకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేటప్పుడు ఎంఎస్ఎంఈలకు రిజర్వేషన్లు , ఫీజు మినహాయింపులు ఉంటాయి. పేటెంట్ రిజిస్ట్రేషన్, ట్రేడ్‌మార్క్ అప్లికేషన్లపై 50% వరకు సబ్సిడీ లభిస్తుంది. అలాగే విద్యుత్ బిల్లులు, బార్‌కోడ్ రిజిస్ట్రేషన్లపై కూడా రాయితీలు పొందవచ్చు. రూ. 1 కోటి వరకు పెట్టుబడి, రూ. 5 కోట్ల వరకు టర్నోవర్ సూక్ష్మ పరిశ్రమల వారు, రూ. 10 కోట్ల వరకు పెట్టుబడి, రూ. 50 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న చిన్న పరిశ్రమల వారు, రూ. 50 కోట్ల వరకు పెట్టుబడి, రూ. 250 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న మధ్యతరహా పరిశ్రమల వారు అర్హులు. దీని కోసం కేవలం యజమాని ఆధార్ కార్డు , పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. అధికారిక వెబ్‌సైట్ udyamregistration.gov.in ని సందర్శించాలి. ఆధార్ నంబర్ ద్వారా ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వ్యాపార వివరాలు, పెట్టుబడి , టర్నోవర్ సమాచారాన్ని నమోదు చేయాలి. దరఖాస్తు పూర్తయిన వెంటనే ఉచితంగా 'ఉద్యమ్ సర్టిఫికేట్' డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చిన్న వ్యాపారాలను పెద్ద పరిశ్రమలుగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ పథకం వెన్నెముకగా నిలుస్తోంది. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకుని ప్రభుత్వ ఫలాలను అందుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న వ్యాపారాలను పెద్ద పరిశ్రమలుగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి వెన్నెముక ఉద్యమ్ రిజిస్ట్రేషన్ !
الثلاثاء، 3 مارس 2026
backbone of the government's goal of transforming small businesses into big industries business national Udyum Registration
ليست هناك تعليقات:
إرسال تعليق