తెలంగాణలో ఇప్పటికే బీసీలుగా గుర్తింపు పొందిన కొన్ని కులాలను ఇప్పటికీ కేంద్ర ఓబీసీ జాబితాలో చేరకపోవడం వల్ల ఆ వర్గాలకు కేంద్రస్థాయి అవకాశాలు దక్కడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాబోయే జనాభా గణనకు ముందు ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ కమిషన్ మరోసారి విజ్ఞప్తి చేసింది. జనాభా లెక్కింపులో ఈ కులాలు బీసీలుగా నమోదు కాకపోతే, రాష్ట్రంలో బీసీల అసలు సంఖ్య తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని కమిషన్ హెచ్చరిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 130 కులాలను బీసీలుగా గుర్తించింది. ఈ కులాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో రిజర్వేషన్లు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు, విద్యా సదుపాయాలు అందుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓబీసీ జాబితాలో మాత్రం తెలంగాణ నుంచి కేవలం 90 కులాలకే స్థానం ఉంది. మిగిలిన 40 కులాలు కేంద్ర జాబితాలో లేకపోవడంతో ఆ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభించడం లేదు. ఈ అసమానత వల్ల ఆ వర్గాల విద్యార్థులు, ఉద్యోగార్థులు అనేక అవకాశాలను కోల్పోతున్నారని బీసీ కమిషన్ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 130 కులాలను బీసీలుగా గుర్తించింది. వీరికి రాష్ట్రస్థాయిలో అన్ని పథకాలు అందుతున్నాయి. కానీ.. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఓబీసీ జాబితాలో మాత్రం మన రాష్ట్రం నుంచి కేవలం 90 కులాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 40 కులాల పేర్లు కేంద్ర జాబితాలో లేవు. అందులో భాగంగానే బీసీ కమిషన్ ఈ సిఫారసులు చేసింది. జనాభా గణనలో ఈ 40 కులాల వారు బీసీలుగా నమోదు కాకపోతే.. రాష్ట్రంలో బీసీల సంఖ్య వాస్తవం కంటే తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది. తద్వారా బీసీలకు అందాల్సిన నిధులు, ప్రయోజనాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, బీసీ కమిషన్ పలుమార్లు కేంద్రానికి విన్నవించినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే.. జనాభా గణన ప్రారంభం కాకముందే ఈ 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు లేఖ రాశారు.
బీసీలుగా గుర్తింపు పొందిన 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చండి : తెలంగాణ బీసీ కమిషన్
الخميس، 5 مارس 2026
CS K. Ramakrishna Rao Include 40 castes recognized as BCs in the central OBC list nce again appealed to the central government to resolve this issue Telangana BC Commission
ليست هناك تعليقات:
إرسال تعليق