10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని అనుమతించకూడదని నిర్ణయించిన కేరళ ప్రభుత్వం

السبت، 14 مارس 2026

decision received approval during a cabinet meeting Kerala Government Decides Against Allowing Women Aged 10 to 50 national Sabarimala Temple

t f B! P L


బరిమల ఆలయంలోకి ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని అనుమతించకూడదని కేరళలోని సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది.క్యాబినెట్ మీటింగ్‌లో దీనిపై ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకుని, వాటిని కాపాడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, త్వరలోనే కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాజకీయ కోణంలోనే ఎల్డీఎఫ్‌ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి వయసుతో సంబంధం లేకుండా మహిళలకు ప్రవేశం కల్పించాలని కొన్నేళ్లక్రితం ఆందోళనలు చెలరేగాయి. అయితే, ఈ నిర్ణయాన్ని శబరిమల ఆలయ యాజమాన్య బాధ్యతలు చూసే ట్రావెన్‌కోర్ దేవస్తాన బోర్డు వ్యతిరేకించింది. ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం ప్రకారం.. మహిళలకు మెనుస్ట్రువల్ సైకిల్ ఉండే పదేళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వయసు మహిళల్ని ఆలయంలోకి అనుమతించబోమని తెలిపింది. ఈ నిర్ణయాన్ని 2018లో ప్రభుత్వం వ్యతిరేకించింది. అన్ని వయసుల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం అందరు మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చని తెలిపింది. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. పాత సంప్రదాయాల ప్రకారమే 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తామని కోర్టుకు తెలిపింది. ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పేందుకు తుది గడువు ఈ రోజే. అందుకే తాజా నిర్ణయాన్ని నేడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై వచ్చే నెల 7 నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. మరోవైపు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంతకాలం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై నమోదైన కేసుల సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ