ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ వైసీపీ ఎంపీలు నిరసనకు దిగారు.  నిరసనతో పాటుగా నినాదాలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు నిరసనగా ఎంపీ లు కొత్త డిమాండ్లు తెర మీదకు తెచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని, కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. టీడీపీ కేడర్ ఆగ్రహంతో అంబటి ఇంటి పైన దాడి చేయటం సంచలనంగా మారింది. ప్రభుత్వం అంబటి ఇంటి మీద దాడి చేసిన టీడీపీ నేతల పైన కేసులు నమోదైంది. అదే విధంగా జోగి రమేశ్ ఇంటి పైన దాడి జరిగింది. అక్కడ దాడి చేసిన వారిని సీసీ కెమేరాల ల ద్వారా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసారు. కాగా, ఈ విషయం పైన ఢిల్లీ స్థాయిలో నిరసనలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. దాడులు జరిగిన సమయంలో మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ లో సైతం హోం శాఖ ను, గవర్నర్ ను ట్యాగ్ చేస్తూ దాడులను ఖండించారు. ప్రభుత్వం పైన జగన్ విమర్శ లు గుప్పించారు. ఇక.. అంబటి, జోగి రమేశ్ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించాని జగన్ డిసైడ్ అయ్యారు. రేపు గుంటూరులో, శుక్రవారం జోగి రమేశ్ కుటుంబాన్ని పరామర్శించేలా ప్లాన్ చేసుకున్నారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కొన్ని రాజకీయ పక్షాలను కలిసి ఏపీలో పరిణామాలను వివరించాలని డిసైడ్ అయ్యారు. ఈ సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. నేరుగా కేంద్రానికి జగన్ లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాడులు జరిగిన విజువల్స్ తో సహా ఫిర్యాదు చేసేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. పార్టీ నేతల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.



Post a Comment

أحدث أقدم