ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటిస్తున్నారు. ఢిల్లీ వేదికగా 'సర్'పై పోరాటం చేస్తున్నారు. సోమవారం మమతతో పాటు మరో ఇద్దరికి ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రధాని కమిషన్ జ్ఞానేష్ కుమార్‌ను మమత కలిశారు. అనంతరం ఆమె బయటకు వచ్చి జ్ఞానేష్ కుమార్ తనను అవమానించారని, అగౌరవపరిచారని ఆరోపించారు. అందుకు ఈసీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. అయినా కూడా ఎన్నికల సంఘం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం భ్రమ అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనను జ్ఞానేష్ కుమార్ చెడుగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. అయితే మమత బెనర్జీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఆమెనే టేబుల్‌ను గట్టిగా కొట్టి వెళ్లిపోయారని తెలిపింది. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉన్న బంగాల్‌కు చెందిన భవన్‌కు కాపలాగా బెంగాల్ నుంచి భద్రతా సిబ్బందిని రప్పించారు. చాణక్యపురిలోని బంగాల్ భవన్ దగ్గర బెంగాల్ పోలీసులు మోహరించారు. 22 మంది సభ్యుల బృందం నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ పోలీసులు బెంగాల్ ప్రజలను బెదిరిస్తున్నారని మమత ఆరోపించారు. ''మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మా ప్రజలకు ఎందుకు బెదిరిస్తున్నారు. వారు న్యాయం కోసం ఇక్కడికి వచ్చారు. అమాయక గ్రామస్తులను వేధించొదు.'' అంటూ ఢిల్లీ పోలీసులపై మమత ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఢిల్లీలో బంగాల్ భవన్ దగ్గర బెంగాల్ పోలీసులు మోహరింపు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق