మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అతివేగంతో వచ్చిన ఒక ఆడి కారు మోటార్ సైకిల్‌ను వెనుక నుండి బలంగా ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకు సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను భగవత్ విశ్వకర్మ (55), అతని కుమారుడు శివం విశ్వకర్మ, బంధువు శీతల్ విశ్వకర్మగా గుర్తించారు. రేవాలోని కోష్టా గ్రామం సమీపంలో హైవేపై బాధితులు ప్రయాణిస్తుండగా, వేగంగా వచ్చిన ఆడి కారు వారిని బలంగా ఢీకొట్టింది. భగవత్ పెద్ద కుమారుడి వివాహం ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బంధువులు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంచేందుకు కుటుంబ సభ్యులు బైక్‌పై బయలుదేరారు. రాయ్‌పూర్ కర్ఛులియన్ వైపు నుండి వస్తున్న ఆడి కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. స్థానికులు బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రాయ్‌పూర్ కర్ఛులియన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు ఆడి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా కారు బైక్‌ను ఢీకొని ముగ్గురు దుర్మరణం
الأحد، 8 فبراير 2026
died on the spot when a speeding car hit their motorcycle while they were on their way to distribute wedding invitations including a father and son Three members of the same family
ليست هناك تعليقات:
إرسال تعليق