తెలంగాణలోని మంచిర్యాల జిల్లా పరిధిలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చోటుచేసుకోవడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపులో ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటి వద్ద పోలీసులు పహారా కట్టారు. మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసుతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమాచారం తెలిసిన వెంటనే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, అదనపు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని నియంత్రించాయి. మరోవైపు క్యాతనపల్లిలో బంద్ కొనసాగింది. మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలను మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్డుకున్నారని బీఆర్‌ఎస్, సీపీఐ నేతలు ఆరోపించారు. తమ మహిళ కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ప్రవర్తించారని, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనలపై నిరసనగా బీఆర్‌ఎస్, సీపీఐ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎన్నికల రోజు కౌన్సిల్ హాల్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్క సుమన్ అరెస్టు కావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు మంత్రి నివాసం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. మంత్రి స్థానిక మున్సిపాలిటీని రాజకీయ ఒత్తిళ్లతో కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సుమన్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ బాల్క సుమన్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ పాలనలో చెన్నూరు, క్యాతనపల్లిలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు. అప్పట్లో నామినేషన్లు దాఖలు చేసిన వారిని బెదిరించి ఉపసంహరణ చేయించారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
Wednesday, February 18, 2026
allegations and counter-allegations have been made between political parties chairman election issue Former MLA Balka Suman arrested Kyatanapalli Municipality Mancherial district telangana
No comments:
Post a Comment