కర్ణాటకలోని విజయపుర జిల్లా బబలేశ్వర్ తాలూకా మంగళూరు గ్రామంలోని పంట పొలాల్లో రెడ్ బర్డ్ ఏవియేషన్ శిక్షణ విమానం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో కెప్టెన్, ట్రైనీ పైలట్ మాత్రమే ఉన్నారు. విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో లోపం తలెత్తడంతో దాన్ని సరిచేందుకు కెప్టెన్, ట్రైనీ పైలట్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పొలాల్లో అత్యవసర ల్యాండింగ్ జరిగే సమయంలో విమానం బలంగా నేలకు తాకడం, వారిరువురూ బయటకు విసిరివేయబడటంతో గాయపడ్డారు. పెద్ద ఎత్తున దుమ్ము, శకలాలలు ఎగసిపడటంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన పైలట్, కెప్టెన్‌ను 108 అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. విజయ్‌పుర ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది.
కుప్పకూలిన రెడ్ బర్డ్ ఏవియేషన్ శిక్షణ విమానం
الأحد، 8 فبراير 2026
Babaleshwar taluk crashed in the agricultural fields karnataka Mangaluru village national Redbird Aviation training aircraft crashes Vijayapura district
ليست هناك تعليقات:
إرسال تعليق