మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని : ప్రధాని మోడీ ట్వీట్

الأحد، 8 فبراير 2026

Malaysian Prime Minister Anwar Ibrahim is a big fan of MGR national PM Modi tweets song from the legendary MGR's film 'Naalai Namadhe' was played

t f B! P L


ప్రధాని నరేంద్రమోడీ మలేషియాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోడీ గౌరవార్థం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆయన విందులో, 1975 నాటి బ్లాక్ బస్టర్ తమిళ సినిమా ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) నటించిన ''నాలై నమదే''లోని ఒక సాంగ్ ప్లే చేశారు. దీంతో, ప్రధాని మోడీ, అన్వర్ ఇబ్రహీం ఎంజీఆర్ అభిమాని అని గుర్తించారు. దీనిని సోషల్ మీడియాలో పీఎం మోడీ పోస్ట్ చేశారు. ''నా స్నేహితుడు, ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన విందులో ఒక పాట, లెజండరీ ఎంజీఆర్ నటించిన సినిమా నాలైనమదే లోనిది. భారత్‌లో చాలా మందిలాగే, ప్రధాని అన్వర్ ఇబ్రహీం కూడా ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని'' అని ట్వీట్ చేశారు. సినిమాలు, సంగీతం, ముఖ్యంగా తమిళ సినిమాల ద్వారా రెండు దేశాలు మరింత దగ్గరవుతాయని తాను విశ్వసిస్తున్నట్లు మోడీ చెప్పారు. ఎంజీఆర్ తమిళ చలనచిత్ర చరిత్రలో, రాజకీయ రంగంలో ఒక ఐకాన్‌గా నిలిచారు. అన్నాడీఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాయి. 1987లో ఆయన మరణించినప్పటికీ, తమిళనాడుతో సహా దేశంలో చాలా ప్రాంతాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. మలేసియా-భారత్ మధ్య చోళుల కాలం నుంచే సంబంధాలు ఉన్నాయి. మలేషియాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద భారత సంతతి ప్రజలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది తమిళులే. అక్కడి పాఠశాలలు, మీడియా, సాంస్కృతిక రంగాలల్లో తమిళ భాషకు స్పష్టమైన స్థానం ఉంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ