జ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల భారత్‌పై ప్రశంసల కురిపించారు. భారత్‌ను 'గ్లోబల్ పవర్​'గా అభివర్ణించిన ఆయన, రానున్న రోజుల్లో మధ్యప్రాచ్యం, ప్రపంచ రాజకీయాలను శాసించే ఆరు దేశాల కూటమి 'హెక్సాగన్' కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పశ్చిమాసియాలో 'రాడికల్‌ పరిస్థితుల'ను ఎదుర్కోవడమే లక్ష్యంగా నెతన్యాహు ఈ కూటమిని ప్రతిపాదించారు. ఇందులో ఇజ్రాయెల్‌, గ్రీస్‌, సైప్రస్‌లతో పాటు భారత్‌ ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం చుట్టూ ఆరు శక్తులతో ఒక కూటమిని ప్రతిపాదించారు. దీనిని ఆయన 'హెక్సాగన్' (షడ్భుజి)గా అభివర్ణించారు. ఈ కూటమిలోని దేశాలు భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, మధ్యధరా దేశాలు, ఆసియాలోని ఇతర దేశాలు, ఇజ్రాయెల్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయని అన్నారు. ఇది కేవలం ఒక వాణిజ్య కూటమి మాత్రమే కాదు. తీవ్రవాద భావజాలం కలిగిన రాడికల్ షియా, సున్నీ వర్గాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పడిన కూటమిగా ఇజ్రాయెల్ భావిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ కూటమిలో అరబ్‌, ఆఫ్రికన్‌, ఆసియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉంటాయని ఇజ్రాయెల్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతకుముందు.. జీ-20 వేదికగా భారత్ ఐఎంఈసీ (ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్)ను ప్రకటించింది. నెతన్యాహు ప్రతిపాదించిన 'హెక్సాగన్' వ్యూహం ఐఎంఈసీకు మరింత బలాన్ని చేకూర్చనుంది. కేవలం రైల్వే లైన్లు, ఓడరేవుల అనుసంధానం మాత్రమే కాకుండా, ఈ దేశాల మధ్య బలమైన రాజకీయ, సైనిక బంధాన్ని ఏర్పరచడమే 'హెక్సాగన్' ఉద్దేశంగా ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. గతంలో ఇజ్రాయెల్ కేవలం అమెరికా, ఐరోపా దేశాలపైనే ఆధారపడేది. కానీ మారుతున్న కాలంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తితో జతకట్టడం ద్వారా ఇజ్రాయెల్ తన భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కూటమి ప్రధానంగా భద్రతా, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిన ఆరు దేశాల సమూహం. భద్రతా పరంగా ఉగ్రవాదం, ప్రాంతీయ అస్థిరతను ఎదుర్కోవడానికి ఒక సమిష్టి వేదిక కానుంది. ఆర్థిక పరంగా ఇంధన, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారం, రక్షణ ఒప్పందాల కోసం ఉపయోగపడనుంది. రాజకీయ పరంగా భారత్‌కి మధ్యప్రాచ్యం, యూరప్‌లో మరింత ప్రభావం పెంచే అవకాశం ఉంది.

Post a Comment

أحدث أقدم