ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన భార్య సారాతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ప్రధాని మోడీ చివరిసారిగా 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించారు. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఇజ్రాయెల్ పార్లమెంటును (నెస్సెట్) ఉద్దేశించి ప్రసంగించబోతున్న తొలి భారత ప్రధానమంత్రిగా మోడీ చరిత్ర సృష్టించనున్నారు. మోడీ ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను కూడా కలుస్తారు. అలాగే పవిత్ర నగరమైన జెరూసలేంను సందర్శించనున్నారు. భారత్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన అత్యంత కీలకం కానుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటన రెండు దేశాల స్నేహ బంధంలో ఒక కొత్త అధ్యాయంగా నిలవనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ చేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : భార్య సారాతో కలిసి స్వాగతం పలికిన నెతన్యాహు
الأربعاء، 25 فبراير 2026
Modi was given a guard of honor at the airport Netanyahu welcomes him with his wife Sara Prime Minister Narendra Modi arrives in Israel
ليست هناك تعليقات:
إرسال تعليق