ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ పై  నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయింది. జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ఫిర్యాదు మేరకు జగన్ పర్యటన సమయంలో జోగి రమేష్ బైక్ ర్యాలీ నిర్వహించి, పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు, అనుమతి లేకుండా రోడ్లు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్ స్తంభించి సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించి, శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా జోగి రమేష్‌పై మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Post a Comment

أحدث أقدم