బంగ్లాదేశ్‌లో తారిఖ్ రహమాన్ ప్రధానిగా ఎన్నికకానున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 17న జరగనుంది. ఈ వేడుకకు పలు దేశాలకు చెందిన నేతలను బంగ్లా ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం పంపింది. ఢాకాలో జరిగే రహమాన్ ప్రమాణ స్వీకారానికి అతిథిగా హాజరుకావాలని కోరింది. అయితే, అదే రోజు ప్రధాని మోడీకి వేరే కార్యక్రమం ఉంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మ్యాక్రాన్ ఇండియాలో పర్యటించనున్నారు. ఆయనను 17న మోడీ ముంబైలో కలుస్తారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి ఇండియా ప్రతినిధిగా హాజరవుతారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రహమాన్ ప్రమాణ స్వీకారానికి ఓం బిర్లా హాజరు కావడం ఇరు దేశాల సంబంధాలకు, ప్రజాస్వామ్య విలువలకు అద్దం పడుతోందని, బంగ్లాకు భారత ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందని కేంద్రం తెలిపింది.
తారిఖ్ రహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న స్పీకర్ ఓం బిర్లా
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق