తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో పాటు బీజేపీ నాయకురాలు ఖుష్బూ, అన్నాడీఎంకే నేతలపై డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. కాగా 2023లో రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలను చదవకపోవడాన్ని తప్పుబడుతూ కృష్ణమూర్తి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు గవర్నర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఆయన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారడంతో అప్పట్లోనే చెన్నైలోని కొడుంగయ్యూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీఎంకే నేతకు జైలుశిక్ష విధించింది.
డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق