కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. యువతకు ఉద్యోగాలు దొరకడంలేదని, తయారీరంగం కుదేలవుతోందని, పెట్టుబడులు దేశం నుంచి తరలిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 'ఉద్యోగాలు లేని యువత, పడిపోతున్న తయారీ రంగం, దేశం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, కుప్పకూలుతున్న కుటుంబ పొదుపు, రైతుల కష్టాలు, పొంచివున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు వీటన్నింటినీ బడ్జెట్ పట్టించుకోలేదు. దిద్దుబాటు చర్యలకు నిరాకరిస్తున్న ఈ బడ్జెట్, భారతదేశ వాస్తవ సంక్షోభాలపట్ల గుడ్డిగా వ్యవహరిస్తోంది' అని రాహుల్‌గాంధీ పోస్టు చేశారు. అంతకుముందు బడ్జెట్‌పై స్పందించాలని పార్లమెంట్ ఆవరణలో మీడియా కోరగా రేపు పార్లమెంట్‌లోనే మాట్లాడుతా అని రాహుల్ చెప్పారు.
భారతదేశ వాస్తవ సంక్షోభాలపట్ల గుడ్డిగా వ్యవహరిస్తోన్న బడ్జెట్ !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق