కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, మూలధన వ్యయం పెరగడం మంచి పరిణామని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జల జీవన్ మిషన్‌లో కేంద్ర, రాష్ట్ర వాటా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్లు దేశం మొత్తం ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం 12 వేల కోట్లు ఈ మిషన్ కోసం అప్పు చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం కోసం చేసిన కృషి వల్లే కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి నిధుల కేటాయింపు జరిగిందన్నారు. ''ప్రతిపాదిత బడ్జెట్ కంటే ఎక్కువ అప్పు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కార్పోరేషన్‌ల ద్వారా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. కార్పోరేషన్ల పేరుపై చేసే అప్పు దేనికి వాడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జలజీవన్ మిషన్ కోసం తెచ్చిన 12 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. రాజధాని పేరుతో 47 వేల 300 కోట్ల అప్పు చేసారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చాలా తక్కువ అప్పులు చేసింది. కానీ టీడీపీ తనకున్న మీడియా బలంతో ప్రజలను తప్పుదోవ పట్టించారు'' అని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో సైతం ఏపీలో బలమైన ఆర్థిక వ్యవస్థకు వైఎస్ జగన్ ప్రభుత్వం పునాది వేసింది. 2014 -19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు కంటే 2019 - నుంచి 2024 వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పు చాలా తక్కువ. చంద్రబాబు ప్రభుత్వానికి మ్యాటర్ వీక్ - పబ్లిసిటీ పీక్. కేంద్ర ప్రభుత్వ పథకాలు వాడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బుక్ గందరగోళంగా ఉంటుంది.. ఈసారి అయినా క్లారిటీతో ఇవ్వాలి. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచితే వద్దని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కూటమి ప్రభుత్వం భౌతిక దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తుంది. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. ఇలాంటి రాజకీయాలు కూటమి ప్రభుత్వానికి తగదు. దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం భౌతిక దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తుంది !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق